Telugu

Telugu

 

పరిచయం

డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం. ఈ విభాగం తెలుగు భాష సాహిత్యం సంస్కృతి మరియు మానవీయ విలువల పరిరక్షణతో పాటు విద్యార్థుల సృజనాత్మక, విమర్శనాత్మక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నది. తెలుగు భాష సాహిత్యంలోని ప్రాచీన సంప్రదాయాల నుంచి ఆధునిక సాహిత్య ప్రక్రియల వరకు విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించడం తెలుగు విభాగం ప్రధాన లక్ష్యం. తెలుగు బోధన సంప్రదాయ పద్ధతులతో పాటు ICTఆధారిత బోధన డిజిటల్ వనరులు మరియు ఆధునిక అభ్యాసన విధానాలను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థి కేంద్రిత బోధనకు ప్రాధాన్యత ఇస్తుంది.  

 మా లక్ష్యాలు

1.    తెలుగు భాష పై విద్యార్థుల్లో ఆసక్తి అభిమానం పెంపొందించడం.

2.    తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు,సాహిత్య ఉద్యమాలు మరియు సాంస్కృతిక విలువలపై అవగాహన కల్పించడం.

3.    విద్యార్థుల్లో పఠనం, రచన, ప్రసంగం, సృజనాత్మక మరియు విమర్శనాత్మకత ఆలోచన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

4.    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు భాషా సాహిత్య అధ్యయనంతో అనుసంధానం చేయడం.

5.    పరిశోధన దృక్పథాన్ని పెంపొందించి విద్యార్థులను ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలకు సిద్ధం చేయటం.

6.    తెలుగు భాష సాహిత్యం మరియు సంస్కృతి పట్ల  సామాజిక బాధ్యతను పెంపొందించడం.

 అకడమిక్ మరియు సాహిత్య కార్యకలాపాలు

తెలుగు విభాగం విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి కోసం వ్యాసరచన వక్తృత్వం,కవితా పఠనం సాహిత్య చర్చలు సెమినార్లు వర్క్ షాప్ లు అతిధి ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వివిధ సృజనాత్మక కార్యక్రమాలను కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

 

తెలుగు భాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవం ప్రముఖ తెలుగు కవులు మరియు రచయితల జయంతి వర్ధంతి కార్యక్రమాలు సాహిత్య సదస్సులు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో భాష సాహిత్య స్పృహను పెంపొందిస్తుంది.

పరిశోధన కార్యక్రమాలు

విభాగం అధ్యాపకులు పరిశోధన సదస్సులు సెమినార్లు మరియు పరిశోధన వ్యాసాల ప్రచురణలు చురుకుగా పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో పరిశోధన ఆసక్తిని పెంపొందించేందుకు సాహిత్య అధ్యయనం, సమకాలీన అంశాలపై చర్చలు మరియు పరిశోధన ఆధారిత అభ్యసనానికి ప్రోత్సాహం అందిస్తున్నారు.

మా ప్రత్యేకత

తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా జ్ఞానం, సంస్కృతి, సృజనాత్మకత మరియు మానవీయ విలువలకు వారధిగా భావిస్తూ విభాగం తన విద్యా కార్యక్రమాలను కొనసాగిస్తుంది.

" తెలుగు భాష మన సంస్కృతికి మూలం;

 తెలుగు సాహిత్యం మన ఆలోచనలకు వెలుగు"


 

విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు సాహిత్య అభివృద్ధి సృజనాత్మకత పరిశోధన దృక్పథం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ ఉత్తమ విద్యావాతరణాన్ని అందించడం తెలుగు విభాగం ప్రధాన సంకల్పం.